Published : 23 Feb 2022 14:21 IST

Rahane - Pujara : ‘‘రహానె-పుజారా ఉద్వాసన నిర్ణయం సరైంది కాదు’’

ఇంటర్నెట్ డెస్క్‌ : స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారాలను తప్పించడంపై మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. వారిద్దరికి అవకాశాలు కల్పిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జట్టు ఎంపిక గురించి టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీపై మాజీ క్రికెటర్‌ అజయ్ జడేజా విమర్శలు గుప్పించాడు. బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కాలేదన్నారు.

‘‘ఇది చాలా బాధాకరం. అయితే రహానె, పుజారాలను తప్పిస్తూ ఏడాది కిందట నిర్ణయం తీసుకుంటే బహుశా నేను మద్దతుగా నిలిచేవాడినేమో. అప్పుడు టీమ్‌ఇండియా వరుస విజయాలతో మంచి స్థానంలో ఉంది. అయితే ఓటమితో సీజన్‌ను ఆరంభించిన భారత్‌కు సీనియర్లను ఉద్వాసన పలకడం సరైంది కాదు.  వీరిద్దరి మాదిరిగా భాగస్వామ్యాలను నిర్మించగలిగే ఆటగాళ్లు ప్రస్తుతానికైతే లేరు. ఇప్పటికే వారు జట్టు కోసం చాలా పరుగులు సాధించారు. స్వదేశంలో ఎవరైనా సరే బ్యాటింగ్‌లో రాణించగలరు. అందుకే ఇలాంటి సమయంలో అవకాశాలు ఇస్తే బాగుండేది. అయితే సెలెక్షన్‌ కమిటీ వారిని పక్కన పెట్టేసింది. అయితే ఇది శాశ్వత ఉద్వాసనో కాదో చెప్పలేను’’ అని జడేజా పేర్కొన్నాడు. 

ఫిబ్రవరి 24 (గురువారం) నుంచి భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. రేపు తొలి టీ20 లఖ్‌నవూ వేదికగా జరగనుంది. మిగతా రెండు మ్యాచ్‌లు ధర్మశాల మైదానంలో జరగనున్నాయి. మార్చి 4 నుంచి 8 వరకు మొహాలీలో మొదటి టెస్టు మ్యాచ్‌, మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు డే/నైట్ టెస్టు బెంగళూరు వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టీమ్‌ఇండియా టీ20, టెస్టు జట్లను ప్రకటించింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని