Team India: రెండు టెస్టుల కోసం అవసరమా? 

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఐదు రోజులు వాయిదా పడటంతో పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపించడంలో మరింత జాప్యం జరుగుతుందని మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా పేర్కొన్నారు...

Published : 12 Jul 2021 01:17 IST

దేవ్‌దత్‌, పృథ్వీని ఇంగ్లాండ్‌కు పంపడంపై దీప్‌దాస్‌ గుప్తా

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఐదు రోజులు వాయిదా పడటంతో పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపించడంలో మరింత జాప్యం జరుగుతుందని మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా పేర్కొన్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన ఆయన టీమ్‌ఇండియా.. లంక, ఇంగ్లాండ్‌ పర్యటనలపై స్పందించారు.

‘ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ కోసం ఇద్దరు యువ ఓపెనర్లు దేవ్‌దత్‌, పృథ్వీషా వెళ్తారనే చర్చ వారం, పదిరోజులుగా సాగుతోంది. లంక పర్యటనలో మ్యాచ్‌లు ఆలస్యమవడంతో వాళ్లిద్దరూ ఈనెల 29 వరకు అక్కడే ఉంటారు. ఒకవేళ 30న ఇంగ్లాండ్‌కు బయలుదేరినా అక్కడ మరో పదిరోజులు హోటల్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. అది పూర్తయిన వెంటనే నేరుగా టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఎందుకంటే వారు సన్నద్ధమవ్వడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. పడిక్కల్‌, షా టెస్టు క్రికెట్‌ ఆడి చాలా రోజులైంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు వెళ్లినా నాలుగో టెస్టు వరకు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు కోహ్లీసేనకు కొత్త ప్రశ్న ఎదురవుతుంది. కేవలం రెండు టెస్టుల కోసం వారిని అక్కడికి తీసుకెళ్లడం అవసరమా? అనే సందేహం తలెత్తుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సరిపడా ఓపెనర్లు ఉన్నారు’ అని దీప్‌దాస్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని