Deepak Chahar: ఫైనల్‌లో ఆ జట్టును ఓడిస్తేనే అసలైన మజా: దీపక్ చాహర్
గాయం కారణంగా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేసర్ దీపక్ చాహర్ కీలక సమయంలో అదరగొట్టేస్తున్నాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తూ వికెట్లు పడగొడుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) ఫైనల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. గాయం నుంచి కోలుకోని రావడం, సీఎస్‌కే ఫైనల్‌కు చేరడం, టైటిల్ కోసం ఎవరితో తలపడాలని ఉంది.. వంటి విషయాలపై మాట్లాడాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో చివరి క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టిన దీపక్ చాహర్.. ఆ క్యాచ్‌కు తానే కామెంట్రీ చెబుతూ తన సంభాషణను ప్రారంభించాడు. సురేశ్ రైనా, పార్థివ్ పటేల్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ముందుకు సాగాడు.
అదే పెద్ద సవాల్
గాయాల నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి రావడం ఏ ఆటగాడికైనా సవాల్‌తో కూడుకున్న విషయం. ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. ఒక మ్యాచ్ పోయినా.. ఇంకా చాలా మ్యాచ్‌లు మన ముందుంటాయి. ఇలాంటి టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లో రాణించినా.. అది మొత్తం ఫలితాన్నే మార్చేస్తుంది.
మా సన్నద్ధత అలా ఉంటుంది..
ఐపీఎల్‌లో ఫైనల్‌తో కలిపి మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాలనే లక్ష్యంతోనే మా సన్నద్ధత కొనసాగుతుంది. ఫైనల్‌లో చివరి ఓవర్ ఎలా బౌలింగ్ వేయాలనే లక్ష్యంతోనే ప్రాక్టీస్ ఉంటుంది. బ్యాటింగ్ బృందం కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తుంది. గెలుపును లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మ్యాచ్‌ను దానికి సన్నాహక మ్యాచ్‌గా మలుచుకుంటాం. ఫైనల్‌కు ఎవరొచ్చినా ఫరవాలేదు. ప్లేఆఫ్స్ చేరిన మిగిలిన మూడు టీమ్‌లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం ముంబయి ఇండియన్స్‌ను ఓడించడంలో మజా ఉంటుందని అనుకుంటున్నా.
నా సహచరులకు చెప్పేదదే
బౌలింగ్‌లో మన బలాలపైనే దృష్టి సారించాలని నేను సహచర బౌలర్లకు చెబుతుంటాను. పవర్ ప్లేలో బయట ఉండే ఇద్దరు ఫీల్డర్లను ఎలా ఉపయోగించుకోవాలోనే దానిపై దృష్టి సారించాలని సూచిస్తుంటాను. మనం వేసిన బంతిని బ్యాటర్ సిక్సర్‌గా మలిస్తే వెంటనే వ్యూహాన్ని మారుస్తుంటాం. కానీ, బ్యాటర్ దీన్ని పసిగట్టి మరో షాట్‌కు సిద్ధంగా ఉంటాడు. అందుకే ముందు వేసిన బంతినే తిరిగి సంధిస్తే మంచి ఫలితం ఉండొచ్చు. నేను టీమ్ వెలుపల ఉన్నపుడు సహచర బౌలర్లకు ఇలాంటి సూచనలు ఇస్తుంటా.
అతడి సపోర్ట్ ఉందంటే..
బౌలర్‌కు తన నైపుణ్యంపై విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం. అప్పుడే గ్రౌండ్‌లో రాణించగలుగుతాడు. ఇక మహీంద్ర సింగ్ ధోనీ లాంటి కెప్టెన్ సపోర్ట్ చేస్తున్నారంటే కచ్చితంగా మనలో ఏదో టాలెంట్ ఉందనే అర్థం. ధోనీ ఒకరిని ఎంచుకుంటే అతనికి టోర్నీ ఆసాంతం అవకాశం ఇస్తాడు. తద్వారా అతను మంచి ఆటగాడిగా రూపుదిద్దుకుంటాడు.
లోపాలను ఎత్తి చూపకూడదు
టోర్నమెంట్ ఆరంభం నుంచి కేవలం గెలుపు గురించి మాత్రమే మాట్లాడాలి. అలా చేసే టీమ్ ప్రదర్శన కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. అలా కాకుండా ఒకరికొకరు లోపాలను ఎత్తిచూపుతూ పోతే లక్ష్యాన్ని చేరుకోలేం. నేనెప్పుడూ గెలుపు గురించే మాట్లాడతా. ఇక విదేశీ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడం కోసం డబ్బుల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే మనకు ఇంత డబ్బు లభిస్తుందని (నవ్వుతూ) నేను వారికి చెబుతూ ఉంటాను. అదే మన ప్లేయర్ల విషయానికి వస్తే.. ఈసారి బాగా ఆడితే ఇండియా జట్టుకు ఆడే అవకాశం లభిస్తుందని చెబుతుంటా. కానీ, విదేశీ ప్లేయర్లకు మాత్రం డబ్బు గురించి చెప్పి మోటివేట్ చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
-
Sports News
CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల