Tokyo Olympics: కూతురు ఛాంపియన్‌.. తండ్రి ఆటో డ్రైవర్‌

కూతురు తన ఆటలో వరల్డ్‌ నెంబర్‌ వన్‌. ఒలింపిక్స్‌లో పతకం కోసం 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోస్తోంది. ఆమె

Published : 25 Jul 2021 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కూతురు తన ఆటలో వరల్డ్‌ నెంబర్‌ వన్‌. ఒలింపిక్స్‌లో పతకం కోసం 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోస్తోంది. ఆమె తండ్రి మాత్రం ప్రయాణికులను తన ఆటోలో ఎక్కించుకొని గమ్య స్థానాలకు చేరుస్తున్నాడు. ఈ పాటికే ఆ తండ్రీకూతుళ్లు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును! ఆమె ఆర్చర్‌ దీపికా కుమారినే. అక్కడ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోసం సన్నద్ధమవుతోంది. జనం కళ్లలో వత్తులు వేసుకొని ఆమె ఆట కోసం ఎదురుచూస్తున్నారు. దీపిక నాన్న శివ్‌నారాయణ్‌ మహతో ఎప్పటిలాగే ఆటో నడుపుతున్నారు.

దీపిక నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిగా ఎదిగే దాకా కష్టాలతో సహవాసం చేసింది. కానీ, ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం మొదలైందో అప్పట్నుంచే తన ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అనంతరం ఇంట్లో డబ్బులకు ఇబ్బంది లేదు. అయినా ఇంకా ఆటో నడపాల్సిన అవసరం ఏముంది? ఇదే మాట.. ఒక టీవీ ఛానెల్‌ విలేకరి శివ్‌నారాయణ్‌ని అడిగాడు. ‘ఖాళీగా ఉండటం నాకు చేతకాదు. ఏదో ఒక పని చేయాల్సిందే. అందులో చిన్న, పెద్దా అని తేడా ఉండదు. ఆటో నడపడం నాకు చిన్నతనం, నామోషీ అనిపించదు. దీపిక కూడా మొదట్లో పాపా మీరు ఇంక ఆటో నడపాల్సిన అవసరం లేదు అనేది. ఇంట్లో ఉంటే తోదని చెప్పా. తనూ నా ఇష్టానికి వదిలేసింది’ అని చెప్పారాయన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని