
Sports News: 3స్వర్ణాలతో దీపిక@ ప్రపంచ నం.1
ప్యారిస్: భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. ప్యారిస్‌లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్ -3లో ఆమె మూడు స్వర్ణ పతకాలు ముద్దాడిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత, బృంద, మిక్స్‌డ్ విభాగాల్లో రాణించడంతో తన ర్యాంకింగ్ గణనీయంగా మెరుగైంది. 2012లోనే ఆమె నంబర్‌వన్‌గా అవతరించింది.
‘ఈ ప్రదర్శనలు దీపికను సోమవారం ప్రపంచ నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తాయి’ అని ప్రపంచ ఆర్చరీ సంఘం ఇంతకు ముందే ట్వీట్ చేయడం విశేషం.
మొదట అంకితా భకత్, కోమలికతో కలిసి మహిళల రికర్వ్ బృంద పోటీల్లో ఆమె మెక్సికోను ఓడించి స్వర్ణం గెలిచింది. ఆ తర్వాత భర్త అతాను దాస్‌తో కలిసి మిక్స్‌డ్ విభాగంలో విజయ దుందుభి మోగించింది. నెదర్లాండ్స్ జంట జెఫ్ వాన్‌డెన్, గ్యాబ్రియేల్‌పై 0-2తో వెనకబడినా, తర్వాత పుంజుకొని 5-3తో పసిడి పతకం సాధించింది.
ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. రష్యా ఆర్చర్, ప్రపంచ 17వ ర్యాంకర్ ఎలీనా ఒసిపోవాను 6-0తో చిత్తుగా ఓడించింది. వ్యక్తిగత విభాగంలో నాలుగో ప్రపంచకప్ స్వర్ణం కైవసం చేసుకుంది. మొత్తంగా ఆమె ప్రపంచకప్‌లో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 7 కాంస్యాలు గెలవడం ప్రత్యేకం.
‘ప్రపంచకప్‌లో మొత్తం 3 స్వర్ణాలు గెలవడం నాకిదే తొలిసారి. నాకెంతో సంతోషంగా ఉంది. అయితే మున్ముందు కీలక పోటీలు ఉన్నాయి. నేనిలాగే మెరుగ్గా రాణిస్తూనే ఉండాలి’ అని దీపిక వెల్లడించింది. డోలా బెనర్జీ తర్వాత ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన భారత ఆర్చర్ దీపిక ఒక్కతే కావడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఏకైక ఆర్చర్ సైతం తనే కావడం విశేషం.
ఇవీ చదవండి
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.