Deepti Sharma: ఆసియా కప్‌లో అదుర్స్.. ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన దీప్తి శర్మ

ఆసియా కప్‌లో రాణించడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.  

Published : 12 Oct 2022 01:13 IST

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ దూసుకొచ్చింది. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో టాప్‌-3లోకి మళ్లీ అడుగు పెట్టింది. బౌలింగ్‌, ఆల్‌రౌండర్ల జాబితాలోనూ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. బౌలింగ్‌ విభాగంలో సోఫీ ఎక్లెస్టోన్ (756 పాయింట్లు), సారా గ్లెన్ (737) తర్వాత.. దీప్తి శర్మ (724) నిలిచింది. ఈ విభాగంలో దీప్తి శర్మ కాకుండా మరో భారత క్రికెటర్ రేణుకా సింగ్‌ (693) మాత్రమే టాప్‌-10లోకి వచ్చింది. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ దీప్తి శర్మ 367 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకొంది. టీమ్ఇండియా నుంచి మరే ప్లేయరూ కూడా తొలి పది మంది లిస్ట్‌లో లేరు.

ఆసియా కప్‌లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి మంధాన (720 పాయింట్లు),  జెమీమా రోడ్రిగ్స్‌ (654), షఫాలీ వర్మ (647) టాప్‌-10లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్లు బెత్ మూనీ (743 పాయింట్లు), మెగ్ లానింగ్ (725) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. భారత సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్ (583) రెండు స్థానాలు దిగజారి 17వ ర్యాంక్‌కు పడిపోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని