Delhi Capitals: దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల క్రికెట్ కిట్ల చోరీ..!
దిల్లీ(Delhi Capitals) ఆటగాళ్లకు సంబంధించిన విలువైన క్రికెట్ కిట్లు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఆ జట్టు యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
దిల్లీ : ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టుకు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ జట్టు ఆటగాళ్ల విలువైన బ్యాట్లు, ప్యాడ్లు చోరీకి గురైనట్లు సమాచారం. ఇటీవల బెంగళూరు(RCB)తో మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు దిల్లీకి చేరుకున్నారు. ఒకరోజు అనంతరం వారి లగేజీ వచ్చింది. వాటిని తెరిచి చూడగా దాదాపు అందరి ఆటగాళ్ల బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర క్రికెట్ ఎక్విప్‌మెంట్ మిస్ అయినట్లు గుర్తించారు. బ్యాటర్ యశ్ ధుల్‌కు చెందిన ఐదు బ్యాట్లు పోయినట్లు సమాచారం.
రూ.లక్షల విలువ చేసే క్రికెట్ ఎక్విప్‌మెంట్ చోరీకి గురికావడంతో ఈ ఘటనపై పొలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో దిల్లీ(DC) యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
ఇక ఆట విషయానికి వస్తే.. దిల్లీ ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకూ ఖాతా తెరవలేదు. తన తదుపరి మ్యాచ్‌లో గురువారం కోల్‌కతాను తమ సొంత మైదానంలో దిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి.. ఓటములకు అడ్డుకట్ట వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!