MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్‌.. ముంబయి లక్ష్యం 132

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 26 Mar 2023 21:18 IST

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ (MIW)తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) ఫైనల్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35; 29 బంతుల్లో 5×4), షిఖా పాండే (27 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4,1×6), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4,2×6) మినహా  ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముంబయి బౌలర్లలో వాంగ్‌, హెయిలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అమీలా కెర్‌ రెండు వికెట్లు తీసింది.

బ్యాటింగ్‌ ప్రారంభించిన దిల్లీ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (11; 4 బంతుల్లో 1×4, 1×6) తక్కువ పరుగులకే వెనుదిరిగింది. వాంగ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి అమీలా కెర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. తర్వాత క్రీజులోకి వచ్చిన క్యాప్సీ (0) పరుగులేమీ చేయకుడానే వెనుదిరిగింది. దీంతో మరో ఓపెనర్‌, కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ, 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాంగ్‌ బౌలింగ్‌లోనే  అమన్‌జ్యోత్‌ కౌర్‌కు క్యాచ్‌ ఇచ్చి రోడ్రిగ్స్‌ వెనుదిరిగింది. ఆ తర్వాత జట్టు స్కోరు 73 పరుగుల వద్ద మరిజన్నె కప్‌ (18) అమీలా కెర్‌ బౌలింగ్‌లో భాటియాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది.

ఆ తర్వాతి ఓవర్‌లోనే యాస్తికా భాటియా వేసిన 12.4 మెగ్‌లానింగ్‌ రన్‌అవుట్‌ అయ్యింది. దీంతో జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి వెళ్లిపోయింది. తనియా భాటియా, అరుంధతి రెడ్డి కూడా డకౌటయ్యారు. జోనా సేన్‌ (2), మిన్ను మని (1) పరుగులు చేశారు. ఒకానొక దశలో స్కోరు 100 పరుగులైనా దాటుతుందా? అనిపించింది. కానీ, చివర్లో వచ్చిన షిఖా పాండే, రాధా యాదవ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో దిల్లీ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని