DCw vs MIw: ముంబయికి హ్యాట్రిక్ విజయం.. దిల్లీకి తొలి ఓటమి
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబయి ఇండియన్స్ (MIw) వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గుజరాత్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందిన హర్మన్ సేన.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్(DCw)ని చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబయి ఇండియన్స్ (MIw) వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గుజరాత్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందిన హర్మన్ సేన.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్(DCw)ని చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దిల్లీ.. ముంబయి బౌలర్ల ధాటికి 105 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయి ఓవర్లలో 15 ఓవర్లలో ఛేదించింది. యాస్తికా భాటియా (41; 32 బంతుల్లో 8 ఫోర్లు), హేలీ మాథ్యూస్ (32; 31 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. నాట్ సీవర్ ( 23), హర్మన్‌ప్రీత్ (11) పరుగులు చేశారు. శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్‌లో మాథ్యూస్ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా.. మారిజేన్ కాప్ వేసిన తర్వాతి ఓవర్‌లో యాస్తికా మూడు బౌండరీలు బాదింది. ధాటిగా ఆడుతున్న యాస్తికాను తొమ్మిదో ఓవర్‌లో తారా నోరిస్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. జట్టు స్కోరు 77 ఉన్నప్పుడు మారిజేన్ బౌలింగ్‌లో మాథ్యూస్.. రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. నాట్ సీవర్, హర్మన్ మిగతా పని పూర్తి చేశారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన దిల్లీకి ఇది తొలి ఓటమి.
తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ మెగ్ లానింగ్ (43; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించింది. జెమీమా రోడ్రిగ్స్ (25; 18 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు షెఫాలీ వర్మ (2), అలీస్ క్యాప్సీ (6), మరిజేన్ కాప్ (2), జెస్ జొనాసెన్ (2), తానియా భాటియా (4) రాధా యాదవ్ (10), తారా నోరిస్ (0), మిన్ను మని (0) విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్, ఇస్సీ వాంగ్, హేలీ మాథ్యూస్ మూడేసి వికెట్లతో ఆకట్టుకోగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది.
25 పరుగులకే ఏడు వికెట్లు
12 ఓవర్లకు 80/3 స్కోరుతో కాస్త మెరుగ్గానే కనిపించిన దిల్లీ మరో 25 పరుగులు జోడించి చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్‌లో ఇషాక్.. రోడ్రిగ్స్, మెగ్ లానింగ్‌లను ఔట్ చేసి దిల్లీని గట్టి దెబ్బతీసింది. తర్వాతి ఓవర్‌లో కూడా దిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో రాణించిన జొనాసెన్‌తో పాటు మిన్నును మాథ్యూస్ పెవిలియన్‌కు పంపింది. 17 ఓవర్‌లో ఇస్సీ వాంగ్.. భాటియా, రాధాయాదవ్‌లను ఔట్ చేసింది. తర్వాతి ఓవర్లో నోరిస్‌ను మాథ్యూస్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దిల్లీ ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు