MI Vs DC: టాస్‌ గెలిచి  బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్‌

మరికాసేపట్లో ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన దిల్లీ.. తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. గత మ్యాచ్‌లో పంబాబ్‌పై విజయం సాధించిన ముంబయి.. ఇందులోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని భావిస్తోంది.  మరోవైపు, ఐపీఎల్ రెండో దశలో

Updated : 02 Oct 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన దిల్లీ తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. గత మ్యాచ్‌లో పంబాబ్‌పై విజయం సాధించిన ముంబయి.. ఇందులోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని భావిస్తోంది. మరోవైపు, ఐపీఎల్ రెండో దశలో వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్లీ క్యాపిటల్స్‌ గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లాలని చూస్తోంది.

ముంబయి ఇండియన్స్‌ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్‌), డికాక్, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్ తివారీ, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కౌల్టర్‌ నైల్‌, జయంత్‌ యాదవ్‌, బౌల్ట్‌, బుమ్రా

దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, స్టీవ్‌ స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్(కెప్టెన్‌), హెట్‌మయర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, అవేశ్ ఖాన్‌, నోర్జ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని