T20 League : దిల్లీ ఫిజియోకు కొవిడ్‌.. టీ20 లీగ్‌లో కరోనా కలకలం!

ఎలాంటి ఇబ్బంది లేకుండా బయోబబుల్‌ ఏర్పాటు చేసి కఠిన ఆంక్షల మధ్య ..

Published : 15 Apr 2022 20:46 IST

(ఫొటో సోర్స్: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. దిల్లీ జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు లీగ్‌ నిర్వాహకులు వెల్లడించారు. ‘‘దిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు. వైద్య బృందం అతడిని అనుక్షణం పరిశీలిస్తోంది’’ అని పేర్కొన్నారు. దీంతో దిల్లీ ఆటగాళ్లకూ కొవిడ్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం సాధనకు కూడా వెళ్లలేదని, హోటల్‌ గదికే పరిమితమయ్యేందుకే ఆటగాళ్లు ఆసక్తి చూపారు. తదుపరి మ్యాచ్‌లో భాగంగా దిల్లీ శనివారం బెంగళూరుతో తలపడనుంది. 

గత సంవత్సరం కొవిడ్ కారణంగా రెండు దశలో టీ20 లీగ్‌ పోటీలను నిర్వహించారు. ఈసారి కూడానూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బయోబబుల్‌ ఏర్పాటు చేసి కఠిన ఆంక్షల మధ్య టోర్నీని నిర్వహిస్తోంది. విమాన ప్రయాణం లేకుండా కేవలం ముంబయి, పుణెలోని నాలుగు మైదానాల్లోనే మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహిస్తోంది. అయినా దిల్లీ ఫిజియో కరోనా బారిన పడటంతో ఆటగాళ్లు, టోర్నీ నిర్వాహకులు సహా అభిమానుల్లో ఆందోళన కలుగుతోంది. మరోవైపు చెన్నై ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ వెన్ను నొప్పితో టోర్నీకి దూరమైనట్లు నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు