ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది: దేవేంద్ర ఝఝరియా

పద్మ భూషణ్‌ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝరియా అన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సోమవారం దేవేంద్ర ఈ అవార్డు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ..

Published : 22 Mar 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పద్మ భూషణ్‌ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝరియా అన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సోమవారం దేవేంద్ర ఈ అవార్డు స్వీకరించాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

‘పారా అథ్లెట్ పద్మ భూషణ్‌ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఇంత గొప్ప అవార్డుతో గౌరవించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఈ అవార్డుతో నాపై బాధ్యత మరింత పెరిగింది. దేశం కోసం మరిన్ని పతకాలు గెలవాలి. దేశ యువతకు నేను చెప్పేది ఒకటే.. అనుకున్న లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి. నేను గత 20 ఏళ్లుగా కష్టపడుతున్నాను’ అని దేవేంద్ర ఝఝరియా పేర్కొన్నాడు. 2004లో ఏథెన్స్‌లో జరిగిన పారాలంపిక్స్‌లో దేవేంద్ర తొలి సారిగా స్వర్ణపతకం సాధించాడు. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్నాడు.

మరో పారా అథ్లెట్‌, టోక్యో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్‌ అవనీ లేఖరా కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ‘పద్మ శ్రీ అవార్డును అందుకోవడం గొప్ప గౌరవం. నేను ఈ స్థాయికి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా పట్టుదల, కుటుంబ సభ్యుల త్యాగాలకు ఈ అవార్డు ప్రతిరూపం. ఇదే పోరాట స్ఫూర్తితో మరిన్ని అవార్డులు గెలవాలని ఉంది’ అని అవనీ ట్వీట్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని