Cricket News: దాదా 25 ఏళ్ల రికార్డు బద్దలు

టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ 25 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ డేవాన్‌ కాన్వే ఆ ఘనతను తిరగరాశాడు. లార్డ్స్‌ వేదికగా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించాడు.....

Published : 03 Jun 2021 12:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ 25 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ డేవాన్‌ కాన్వే ఆ ఘనతను తిరగరాశాడు. లార్డ్స్‌ వేదికగా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించాడు.

దాదా 1996లో టీమ్‌ఇండియా తరఫున లార్డ్స్‌లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ను చితక బాదేస్తూ 131 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు లార్డ్స్‌లో అరంగేట్రంలో అత్యధిక పరుగుల ఘనత గంగూలీ పేరిటే ఉండేది. తాజాగా దానిని కాన్వే బద్దలు కొట్టాడం గమనార్హం.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకు ముందు 1893లో హ్యారీ గ్రాహమ్‌ (107 ఆసీస్‌), 1969లో జాన్‌ హ్యాంప్‌షైర్‌ (107, ఇంగ్లాండ్‌), 2004లో ఆండ్రూస్ట్రాస్‌ (112, ఇంగ్లాండ్‌), మ్యాట్‌ ప్రైయర్‌ (112* ఇంగ్లాండ్‌) మాత్రమే లార్డ్స్‌లో అరంగేట్రంలో శతకాలు బాదడం గమనార్హం.

ప్రస్తుతం న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ మొదటి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు కివీస్‌ 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. డేవాన్‌ కాన్వే (136*; 240 బంతుల్లో 16×4) శతకంతో చెలరేగాడు. అతడు 56.66 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం గమనార్హం. హెన్రీ నికోల్స్‌ (46*; 149 బంతుల్లో 3×4) అతడికి తోడుగా ఉన్నాడు. టామ్‌ లేథమ్‌ (23), విలియమ్సన్‌ (13), రాస్‌ టేలర్‌ (14) విఫలమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని