Chahal-Dhanashree: విడాకుల వదంతులకు చెక్‌ పెట్టేలా.. చాహల్‌-ధనశ్రీ కొత్త రీల్‌

టీమిండియా బౌలర్‌ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal)‌, ధనశ్రీ వర్మ (DhanaShree Verma)  ఇటీవల సోషల్‌ మీడియాలో పెట్టిన......

Published : 24 Aug 2022 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా బౌలర్‌ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal)‌, ధనశ్రీ వర్మ (DhanaShree Verma)  ఇటీవల సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతో ఆ జంట విడిపోతోందేమోనన్న వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్లేనని.. వాటిని నమ్మొద్దంటూ వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనశ్రీ ఇన్‌స్టాలో ఓ రీల్‌ షేర్‌ చేస్తూ ఆ ఊహాగానాలకు మరోసారి చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. భార్య పుట్టింటికి వెళ్తే భర్త సంబురపడిపోతాడు అనేలా.. తాను నెల రోజులపాటు పుట్టింటికి వెళతాను అని ధనశ్రీ చెప్పగానే.. చాహల్‌ ఆనందంతో డ్యాన్స్‌ చేస్తాడు. అతడి నృత్యం చూసిన ధనశ్రీ నవ్వులు చిందిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈరోజు ఉదయం షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే  7.7లక్షల మంది లైక్‌ చేయగా.. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి వచ్చిన రూమర్లను నమ్మొద్దంటూ ఇటీవల చాహల్‌-ధనశ్రీ వేర్వేరుగా కోరిన విషయం తెలిసిందే. తమపై వచ్చే ఎలాంటి రూమర్లను నమ్మొద్దని, దయచేసి వీటికి ముగింపు పలకాలంటూ చాహల్‌ వేడుకున్నాడు. ఆపై ధనశ్రీ కూడా స్పందిస్తూ.. ఇలాంటి పుకార్లు కలచివేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గాయమవడంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ లిగ్మెంట్‌ గతి తప్పిందని.. త్వరలోనే మరో సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని