yuzvendra chahal: చాహల్‌ దంపతుల వెరైటీ కర్వాచౌత్‌: వీడియో

గురువారం కర్వాచౌత్‌ వేడుకను చాహల్‌, ధనశ్రీ వర్మ దంపతులు వెరైటీగా జరుపుకున్నారు.

Published : 15 Oct 2022 01:40 IST

దిల్లీ: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ యుజువేంద్ర చాహల్‌ ప్రపంచ టోర్నీ కోసం ఆసీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో గురువారం కర్వాచౌత్‌ వేడుకను చాహల్‌, ధనశ్రీ వర్మ దంపతులు వెరైటీగా జరుపుకొన్నారు. రోజంతా ఉపవాసం ఉన్న తన భార్యను చాహల్‌ వీడియో  కాల్‌ ద్వారా పలకరించాడు. ఉపవాస దీక్షను విరమింపజేసిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. సెల్‌ఫోన్‌లోనే చంద్రుడి దర్శనం చేసుకున్న ఈ జంట ఒకరినొకరు ఎంతలా మిస్సవుతున్నారో తెలిసేలా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

కొంత కాలంగా వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లకు చెక్‌ పెడుతూ తన భార్యే తన బలం అంటూ చాహల్‌ ఇటీవల పోస్ట్‌ చేశాడు. తమ విడాకులకు సంబంధించిన వదంతులు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తమ పోస్టులు, రీల్స్‌తో నెట్టింట నిత్యం సందడి చేసే ఈ జంట అదే స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. మోడల్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీని చాహల్‌ 2020 డిసెంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్‌కు 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా.. ధనశ్రీని 5 మిలియన్లకు పైగా నెటిజన్లు అనుసరిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని