Archery World Cup: సెమీస్‌లో ధీరజ్‌

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-3 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, అంకిత భాకత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం పురుషుల రికర్వ్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ధీరజ్‌ 7-3తో జొనాథన్‌ వెటర్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు.

Published : 22 Jun 2024 04:36 IST

ఆంటాల్య: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-3 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, అంకిత భాకత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం పురుషుల రికర్వ్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ధీరజ్‌ 7-3తో జొనాథన్‌ వెటర్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. మహిళల రికర్వ్‌ క్వార్టర్‌ఫైనల్లో అంకిత 6-4తో హున్‌ యంగ్‌ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌ (ధీరజ్‌-భజన్‌ కౌర్‌) 3-5తో దక్షిణ కొరియాకు తలొంచింది. ఇక మెక్సికోతో కాంస్య పతక పోరులో తలపడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని