
IPL 2021: ధోనిభాయ్తో కలిసి ఆడటం నా అదృష్టం : పృథ్వీ షా
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనిలో గొప్ప ఫినిషింగ్ సామర్థ్యాలున్నాయని.. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా అన్నాడు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొమ్మిది సార్లు ఫైనల్‌కి చేరుకున్న విషయం తెలిసిందే. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచులో సీఎస్కే కెప్టెన్ ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో వచ్చిన అతడు 6 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 4 వికెట్ల తేడాతో దిల్లీని ఓడించి నేరుగా ఫైనల్ చేరింది.
‘ధోనిభాయ్లో గొప్ప వైవిధ్యముందన్న విషయం మనందరికీ తెలిసిందే. తన అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో సార్లు జట్టును గెలిపించాడు. కాబట్టి, మాపై చెలరేగి ఆడటంలో ఆశ్చర్యమేమి లేదు. అతనో ప్రమాదకర ఆటగాడు. తనదైన రోజున మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని పృథ్వీ షా అన్నాడు.
‘మేం గెలిచినా, ఓడిపోయినా సమష్టిగా బాధ్యత వహిస్తాం. నైపుణ్యపరంగా మా జట్టులో ఉత్తమ ఆటగాళ్లున్నారు. క్యాలిఫైయర్ మ్యాచ్‌లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయినా, మాకు మరో అవకాశం ఉంది. ఆ మ్యాచులో గొప్పగా రాణించి.. నేరుగా ఫైనల్ చేరుతాం. ఆ నమ్మకం మాకుంది’ అని పృథ్వీ షా ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.