Dhoni: ఓ ప్రోమో కోసం.. గుర్తుపట్టలేని విధంగా ధోనీ..!

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే...

Updated : 08 Dec 2022 16:43 IST

(Photo: Starsports India Instagram video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ కూడా చేరకుండా చిత్తుగా విఫలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను గతేడాది అతడు తిరిగి విజేతగా నిలబెట్టాడు. ఇక ఇప్పుడు రాబోయే మెగా టోర్నీలోనూ మరోసారి చెన్నైని ఛాంపియన్‌గా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, అంతకన్నాముందు ఓ ప్రోమోలో కనిపించాడు. ఐపీఎల్‌ టోర్నీ ప్రసారదారు అయిన ‘స్టార్‌స్పోర్ట్స్‌ ఇండియా’ తాజాగా ఆ టీజర్‌ను విడుదల చేసింది. అందులో ధోనీ ఖాకీ రంగు దుస్తులు ధరించి బస్సు డ్రైవర్‌గా కనిపించాడు. ఈ కొత్త లుక్‌ ఎలా ఉందంటూ అభిమానుల అభిప్రాయాలను స్టార్‌స్పోర్ట్స్‌  కోరింది. దీనికి వారి నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కాగా, గతేడాది ఐపీఎల్‌ 2021కు సంబంధించిన ప్రోమోలో ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఒక సన్యాసి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని