
Neeraj chopra: అప్పటి వరకూ జావెలిన్ అంటే ఏమిటో తెలియదు
యాంకర్‌తో తన ఇష్టాలను పంచుకున్న నీరజ్ పాత వీడియో వైరల్
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా సోమవారం భారత్‌కు చేరుకోగా.. సంబరాలు అంబరాన్నంటాయి. 23ఏళ్ల నీరజ్ కేవలం ఆటకే కాదు.. అతడి హెయిర్‌స్టైల్, లుక్స్‌కి అమాంతం క్రేజ్ వచ్చేసింది. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు లక్షల వరకే ఉన్న ఇతగాడి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య.. పసిడి పతకం గెలిచాక ఏకంగా 32 లక్షలకు చేరుకుంది. గతంలో నీరజ్ పెంచిన పొడువాటి జుట్టుకి ఫాన్స్ తెగ ఇష్టపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి.. భాజపా యూత్ నేషనల్ సెక్రటరీ తజేందర్ పాల్ సింగ్ బగ్గా షేర్ చేసిన పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ‘‘నువ్వు జుట్టు పొడవుగా పెంచాలని ఎవరి నుంచి స్ఫూర్తి పొందావు.. నటుడు షారుఖ్ లేదా బౌలర్ ఇషాంత్‌శర్మ’’ అని ప్రశ్నించగా.. ‘‘ఈ ఇద్దరు కాదు. స్వతగాహా పెంచుకున్నా’’ అంటూ బదులిచ్చాడు. ‘‘మీ జీవితంలో జావెలిన్‌తో ప్రయాణం ఎలా మొదలైంది’’ అని ఇంగ్లిష్‌లో ప్రశ్నించగా.. ఇదే ప్రశ్నని హిందీలో అడుగుతారా అని హిందీలో అర్థం చేసుకున్నాక.. ‘‘ దేవుడే ఇలా నిర్ణయించి ఉంటాడు. హరియాణాలోని ఖాందర్ గ్రామంలో ఆటలాడేవాడిని. ఒక రోజు గ్రౌండ్‌కి వెళ్లాక.. మా సీనియర్లు గాల్లో జావెలిన్‌ని ఎగరేయడం చూశా. వాళ్లని చూసి ఈ క్రీడ నేర్చుకున్నా. అప్పటి వరకూ జావెలిన్ అంటే ఏమిటో తెలియదు. అలా ప్రారంభించి.. ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చా’’ అని సమాధానమిచ్చాడు