IND Vs NZ : అతడి వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు.. హార్దిక్ వ్యూహాలపై పాక్ మాజీ ఆటగాడి విమర్శలు
న్యూజిలాండ్‌తో తొలి టీ20(IND Vs NZ)లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)అనుసరించిన వ్యూహాలను పాక్ మాజీ ఆటగాడు తప్పుబట్టాడు. బౌలర్లను రొటేట్ చేయడంలో విఫలమయ్యాడని విమర్శించాడు.
ఇంటర్నెట్‌డెస్క్ : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్(IND Vs NZ)లో టీమ్‌ఇండియా చూపించిన జోష్‌ను.. టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో కొనసాగించలేకపోయింది. అన్ని రంగాల్లో విఫలమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) వ్యూహాలను పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా(Danish Kaneria) తప్పుబట్టాడు. బౌలర్లను మారుస్తూ వైవిధ్యం చూపించడంలో విఫలమయ్యాడని.. అతడి వద్ద ఎటువంటి ప్రణాళికలు లేనట్లు కనిపించాడని అన్నాడు.
‘హార్దిక్ పాండ్య తన బౌలర్లను రొటేట్ చేయడంలో తెలివిగా ప్రవర్తించలేదు. శివమ్ మావిని చాలా ఆలస్యంలో రంగంలోకి దించాడు. అతడితో మొదట్లోనే బౌలింగ్ చేయించాల్సి ఉండేది. దీపక్ హుడాను కూడా ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉండేది. ఇక్కడే హార్దిక్ వ్యూహాలు లోపించాయి. అతడి వద్ద అసలు ప్రణాళికలు ఉన్నట్లు కనిపించలేదు’ అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్‌లో విమర్శించాడు.
హార్దిక్ బౌలింగ్ తీరును కూడా కనేరియా ప్రశ్నించాడు. ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని.. సరైన లెంగ్త్‌లో బంతులను వేయలేదని విమర్శించాడు. ఇక తొలి టీ20లో ఓడిన టీమ్‌ఇండియా.. సిరీస్ చేజారకుండా ఉండాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!