
BCCI: టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్!
ఈనాడు, హైదరాబాద్: టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కింది! వరంగల్‌కు చెందిన టి.దిలీప్ టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైనట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హైదరాబాదీ ఆర్.శ్రీధర్ స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ బాధ్యతలు చేపట్టనున్నాడు. హెచ్‌సీఏ ఎ-డివిజన్ లీగ్స్‌లో కాంటినెంటల్ సీసీ తరఫున దిలీప్ బరిలో దిగాడు. బీసీసీఐ లెవెల్-3 కోర్సు పూర్తి చేసిన దిలీప్.. 14 ఏళ్ల కోచింగ్ కెరీర్లో టీమ్ఇండియా, ఇండియా అండర్-19, ఫస్ట్‌క్లాస్ జట్లకు ఫీల్డింగ్ శిక్షకుడిగా పని చేశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియాకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో టీమ్ఇండియా చీఫ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. దిలీప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ద్రవిడ్ సహచరుడు.. ఇండియా-ఎ, ఇండియా అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన అభయ్శర్మను కాదని దిలీప్‌ను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో అభయ్ సేవలు అవసరమని భావించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) దిలీప్‌కు ఓటు వేసినట్లు తెలిసింది. దిలీప్ ఎంపిక పట్ల హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ ఆనందం వ్యక్తం చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు..
-
General News
Telangana news: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. తప్పిన ప్రమాదం
-
Business News
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 700+
-
Related-stories News
Prince Charles: ఖతర్ నుంచి నగదు రూపంలో విరాళాలు తీసుకున్న ప్రిన్స్ ఛార్లెస్
-
Business News
GST: క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- చెరువు చేనైంది
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం