Umran Malik: ఉమ్రాన్ రాణిస్తున్నాడు.. ప్రపంచకప్ జట్టులో ఉండాలి : వెంగ్‌సర్కార్
ఇంటర్నెట్‌డెస్క్: ఉమ్రాన్ మాలిక్ నైపుణ్యమున్న బౌలర్ అని, అతడికి ప్రపంచకప్‌లో అవకాశం ఇచ్చి చూడాలని 1983 ప్రపంచకప్ ఛాంపియన్ దిలిప్ వెంగ్‌సర్కార్ సూచించాడు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్లో హైదరాబాద్ తరఫున 22 వికెట్లతో అదరగొట్టడమే కాకుండా ఈ సీజన్లో నిలకడగా 150 కిమీకుపైగా వేగవంతమైన బౌలింగ్ చేసి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో రాబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీకి అతడిని టీమ్ఇండియా తరఫున ఎంపిక చేయాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దిలిప్ వెంగ్‌సర్కార్, రోజర్ బిన్నీ సైతం అవే మాటలు చెప్పారు.
‘ఉమ్రాన్ టీ20లీగ్‌లో అదరగొట్టడంతో పాటు అత్యుత్తమ బౌలర్‌గా రాణించాడు. దీంతో రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండటానికి అర్హత సాధించాడు. అతడు కచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళతాడు. అవకాశం వస్తే రాణిస్తాడనే నమ్మకం నాకుంది. ఉమ్రాన్ ఇంకా యువ బౌలరే. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అవకాశం ఇచ్చి చూడాలి. మైదానంలో మేటి ప్రదర్శనలు చేయాలని కసితో ఉన్నాడు. తనదైన ముద్ర వేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు’ అని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు. రోజర్ బిన్నీ సైతం వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలను సమర్థించారు. ఉమ్రాన్ ఇప్పటికే తన వేగంతో ఎంత ప్రమాదకర బౌలరో నిరూపించుకున్నాడని, టీ20లీగ్‌లో కొన్ని యార్కర్లు చూస్తే ఆ విషయం అర్థమవుతుందని చెప్పారు. అలాంటి పేసర్‌ను పక్కనపెట్టడం సరికాదని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
-
India News
Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’..!
-
Sports News
Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!