Published : 14 Dec 2021 02:04 IST

IND vs SA: అతడి వయసు 24 ఏళ్లు.. 28 ఏళ్ల వయసులో ఎంపిక చేయడంలో అర్థం లేదు..

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా పర్యటన కోసం త్వరలో ఎంపిక చేయనున్న వన్డే జట్టులో.. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌కి తప్పనిసరిగా చోటివ్వాలని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్ సర్కార్ సూచించాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారె ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో పాటు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) జట్టు తరఫున ఆడుతున్న అతడు గత సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన విషయం తెలిసిందే. 

‘రుతురాజ్‌ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో శతకాల మోత మోగిస్తున్నాడు. అతడిని నేరుగా దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించవచ్చు. మూడో స్థానంలో కూడా అతడు అద్భుతంగా రాణించగలడు. అందుకే, అతడికి దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అతడేం 18 ఏళ్ల పిల్లవాడు కాదు. ప్రస్తుతం అతడి వయసు 24 ఏళ్లు. 28 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాకు ఎంపిక చేయడంలో అర్థం లేదు’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో రుతురాజ్‌ ఇప్పటికే మూడు శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని