KL Rahul: రాహుల్.. విదేశాల్లో కీలక బ్యాటర్‌గా ఎదగడానికి కారణమదే.! దినేశ్‌ కార్తిక్‌

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (123) శతకంతో రాణించడంపై సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. అతడు విదేశాల్లో...

Published : 01 Jan 2022 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (123) శతకంతో రాణించడంపై సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. అతడు విదేశాల్లో నిలకడగా రాణిస్తూ భారత జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నాడు.

‘ఇటీవల కేఎల్‌ రాహుల్ విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణిస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం చాలా గొప్ప విషయం. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆఫ్‌ సైడ్ బంతులను వదిలేస్తూ.. చాలా ఓపికతో ప్రశాంతంగా ఆడాడు. అతడు ఎక్కువగా కవర్‌ డ్రైవ్‌లు ఆడేందుకు మొగ్గు చూపుతుంటాడు. అందుకే విదేశీ పర్యటనల్లో కీలక బ్యాటర్‌గా మారాడు. టెస్టుల్లో రాహుల్ ఇప్పటి వరకు ఏడు శతకాలు చేస్తే.. అందులో ఆరు శతకాలు విదేశాల్లోనే నమోదు చేయడం గమనార్హం. అవి కూడా కింగ్‌స్టన్‌, సిడ్నీ, సెంచూరియన్‌, లార్డ్స్‌ లాంటి పిచ్‌లపై కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం విశేషం. మరో విషయమేమిటంటే.. అతడికి జోడీగా ఎవరు బ్యాటింగ్‌కు దిగినా చక్కటి సమన్వయంతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్ ఇలా ఎవరితో అయినా భారీ భాగస్వామ్యాలు నిర్మిస్తాడు’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి జొహాన్నెస్‌ బర్గ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని