Published : 08 Feb 2022 09:37 IST

IPL 2022: అది కష్టమే కానీ.. సీఎస్కేకు ఆడితే ఇష్టమే: డీకే

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న అతడు ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఫినిషర్‌గా రాణించాలని ఆసక్తిగా ఉన్న డీకే.. మెగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఏ జట్టుకు ఆడాలని అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. దానికి సమాధానం చెప్పడం కష్టమన్నాడు.

‘నేను బాగా ఆడేందుకు వంద శాతం కృషి చేస్తా. అలాగే చెన్నై నుంచి వచ్చాను కాబట్టి.. సీఎస్కే తరఫున ఆడితే గొప్పగా ఉంటుందని అనుకుంటా. కానీ, నేను ఏ జట్టుకు ఆడినా గౌరవంగానే భావిస్తా. ఎందుకంటే నేను ఈ మధ్య ఎంత బాగా ప్రాక్టీస్‌ చేసినా ఐపీఎల్‌లో రాణించాలనే ఆశిస్తున్నా’ అని డీకే చెప్పుకొచ్చాడు. మరోవైపు టీమ్‌ఇండియాకు మళ్లీ ఆడటంపై స్పందించిన అతడు.. తాను తిరిగి వస్తాననే విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే చాలా మంది అనుకుంటున్నట్లు వయస్సు ప్రామాణికం కాదు. అది కేవలం ఒక సంఖ్య మాత్రమే. శిఖర్‌ ధావన్‌ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మేమిద్దరం ఒకే వయస్సు కలిగిన వాళ్లం’ అని వివరించాడు. ఆటగాళ్లు తమ శారీరక పరిస్థితులను అర్థం చేసుకుంటారని, దీంతో ఎంతకాలం క్రికెట్‌ ఆడగలరో ఒక అవగాహనతో ఉంటారని డీకే పేర్కొన్నాడు. అందుకోసమే తాను ఇప్పుడు దేశవాళీ, ఐపీఎల్‌పై దృష్టిపెట్టానని చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని