Dinesh karthik: ఆ క్యాచ్‌లు ఎందుకు వదిలేశారో అర్థం కాలేదు: దినేశ్ కార్తిక్
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తనను అసంతృప్తికి గురిచేసిందని దినేశ్ కార్తీక్ అన్నాడు.
ఢాకా: బంగ్లాదేశ్‌తో తొలి వన్డే(IND Vs BAN)లో టీమ్ఇండియా ఓటమిపై సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్(dinesh karthik) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంత దారుణమైన ఫీల్డింగ్‌ను తాను ఊహించలేదని అన్నాడు. కేఎల్ రాహుల్(kl Rahul) విషయం అటుంచితే.. వాషింగ్టన్ సుందర్ కనీసం క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించకపోవడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు.
‘‘అవును, చివరి ఓవర్లో కేఎల్ రాహుల్ క్యాచ్‌ను వదిలేశాడు. కానీ, సుందర్ బంతిని క్యాచ్ పట్టేందుకు ఎందుకు ముందుకు రాలేదో అర్థం కాలేదు. అక్కడున్న లైటింగ్ కారణంగా బంతిని చూడలేకపోయాడా.. అనేది తెలియదు. కానీ, ఒకవేళ బంతిని చూసివుంటే వెంటనే అతడు ముందుకు కదిలివుండాలి కదా? ఈ ప్రశ్నకు సమాధానం అతడు మాత్రమే చెప్పగలడు. మొత్తానికి ఫీల్డింగ్ పరంగా మెప్పించలేకపోయారు. ఈ మ్యాచ్ అంత గొప్పగా ఆడలేదు. అలాగని మరీ చెత్తగానూ ఆడలేదు. చివరి ఓవర్లో కొన్ని బౌండరీలను ఒత్తిడి కారణంగా వదిలేసి ఉండవచ్చు’’అంటూ దినేశ్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ఫీల్డర్ల వైఫల్యం కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma)కు సైతం ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఇది క్రికెట్.. కొన్ని సార్లు మనం ఊహించనివి జరుగుతుంటాయి. చివరి వరకు జట్టు బాగా పోరాడింది. అయితే, కొన్ని మిస్సింగ్ క్యాచ్‌లు, మిరాజ్ ఇన్నింగ్స్ వంటివి దెబ్బతీశాయి’’ అంటూ తెలిపాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న బంగ్లాతో జరగనున్న రెండో వన్డేపై ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి
-
General News
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల
-
World News
Pakistan: పోలీసు యూనిఫాంలో వచ్చి.. మారణహోమం సృష్టించి..!