DK: వారిద్దరికి ఒక్క ఛాన్స్ రాకపోయినా.. జట్టులో అపోహలు లేకపోవడానికి కారణమదే: డీకే
పొట్టి కప్‌లో టీమ్ఇండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లు ఇద్దరు. మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్. భారత్ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఒక్కసారి కూడానూ తుది జట్టులోకి స్థానం దక్కించుకోలేకపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఫినిషర్‌గా కీలక పాత్ర పోషిస్తాడని భావించిన సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఘోర ప్రదర్శన చేశాడు. మరోవైపు దీపక్ హుడా, రిషభ్ పంత్‌కు ఒకటీ అరా అవకాశాలు మాత్రమే వచ్చాయి. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. దీంతో తుది జట్టు ఎంపికపైనా నెట్టింట్లో భారీగా కామెంట్లు వచ్చాయి. వరుసగా విఫలమైన అశ్విన్, అక్షర్ పటేల్‌కు అవకాశాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్ మణికట్టు మాంత్రికుడు చాహల్‌ను ఆడించకపోవడం దారుణమని విమర్శలు వచ్చాయి. తాజాగా భారత్ న్యూజిలాండ్‌కు పర్యటనకు వచ్చింది. సీనియర్లు రోహిత్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న దినేశ్ కార్తిక్ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో అద్భుతమైన వాతావరణం కల్పించారని, తుది జట్టులో స్థానం దక్కని వారిద్దరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండేవారని కార్తిక్ వెల్లడించాడు. ‘‘చాహల్, హర్షల్ మాత్రమే ఈ టీ20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచూ ఆడని భారత ఆటగాళ్లు. అయితే వారేమీ ఆగ్రహానికి గురికాలేదు. నిరుత్సాహ పడలేదు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే గడ్డు పరిస్థితుల్లో ఆడుతున్నామని కెప్టెన్, కోచ్ వివరించి చెప్పారు. అందుకే జట్టులో ఆగ్రహాలకు, అపోహలకు, నెగిటివ్ ఆలోచనలకు తావులేకుండా పోయింది’’ అని కార్తిక్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: బండ్లగూడ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం