Dinesh Karthik: నాకు ఆ అవకాశం వస్తే ధోనీ బుర్రను చదివేస్తా: దినేశ్‌ కార్తీక్‌

తనకు ఇతరుల బుర్రలు చదివే అవకాశం వస్తే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌పై ఆ అస్త్రాన్ని సంధిస్తానని...

Published : 13 Jun 2022 02:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనకు ఇతరుల బుర్రలు చదివే అవకాశం వస్తే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై ఆ అస్త్రాన్ని సంధిస్తానని అంటున్నాడు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌. ఇటీవల భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు తరఫున మెరిసిన అతడు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దక్షిణఫ్రికాతో రెండో టీ20కి ముందు బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడాడు. డీకేని పలు ప్రశ్నలు అడగ్గా.. ఇలా సరదాగా సమాధానాలిచ్చాడు.

ప్రశ్న: జట్టుతో డిన్నర్‌ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా?

డీకే: టీమ్‌ డిన్నర్‌ అంటేనే చాలా ఇష్టం. ఆటగాళ్లతో భోజనం చేయడం బాగుంటుంది.

ప్రశ్న: టీ ఇష్టమా? కాఫీ ఇష్టమా?

డీకే: టీ ఇష్టం. భారత దేశంలో ఏ మూలకెళ్లినా దొరుకుతుంది.

ప్రశ్న: ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డాన్స్‌ చేయడం ఇష్టమా?

డీకే: ఇది చాలా కష్టమైన ప్రశ్న. నేను రెండింటిలో ఏదీ చేయలేను.

ప్రశ్న: పర్వత ప్రాంతాలా? బీచ్‌లా?

డీకే: పర్వత ప్రాంతాలే ఇష్టం. నేను ఎక్కడ హిల్‌స్టేషన్‌కు వెళ్లినా.. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

ప్రశ్న: వంట చేయడమా? ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమా?

డీకే: ఇంటిని శుభ్రం చేయడానికే ప్రాధాన్యతనిస్తా. శుభ్రంగా ఉండటం ఇష్టం.

ప్రశ్న: మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా?

డీకే: నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతా. ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నాను. అదే ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే ధోనీ మైండ్‌ను చదివేస్తా.

ప్రశ్న: క్రిస్టియానో రొనాల్డో ఇష్టమా? లియోనెల్‌ మెస్సీనా?

డీకే: మెస్సీ అంటే చాలా ఇష్టం. అతడి ఆటను చూడటం మహా ఇష్టం.

ప్రశ్న: రోజర్‌ ఫెదరర్‌?రఫెల్‌ నాదల్‌?

డీకే: ఫెదరర్‌ 

ప్రశ్న: ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ట్విటర్.. ఏది ఎక్కువ ఇష్టపడతారు?

డీకే: ట్విటర్‌కే ఓటేస్తా.

ప్రశ్న: ఫోన్‌ లేకుండా ఒకరోజు ఉంటారా? లేక వ్యాయామం చేయకుండా ఉంటారా?

డీకే: ఫోన్‌ లేకుండా ఉండటమే నాకు తేలికైన పని. దానికి అంతగా బానిస కాలేదు.

ప్రశ్న: లంబోర్గిని కారు ఇష్టమా లేక మస్టాంగ్‌ కారు ఇష్టమా?

డీకే: నాకు లంబోర్గిని అంటేనే ఇష్టం. దాని నుంచి వచ్చే శబ్దం బాగుంటుంది.

ప్రశ్న: నీ జీవితం మీద పుస్తకం రాయడం ఇష్టమా? సినిమా తీయడం ఇష్టమా?

డీకే: సినిమా అయితే బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని