Dinesh Karthik:దినేశ్‌ కార్తిక్‌ రిటైర్మెంట్‌ తీసుకుంటాడా? ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు

టీమ్‌ఇండియా వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్ కార్తిక్‌ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాలో దినేశ్ కార్తిక్‌ పోస్ట్ చేసిన ఎమోషనల్‌ వీడియోనే ఈ చర్చకు దారితీసింది.

Published : 25 Nov 2022 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్ కార్తిక్‌ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాలో దినేశ్ కార్తిక్‌ పోస్ట్ చేసిన ఎమోషనల్‌ వీడియోనే ఈ చర్చకు దారితీసింది. ‘టీమ్‌ఇండియా తరఫున టీ 20 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం ఈ టోర్నీలో విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, స్నేహితులు, ముఖ్యంగా అభిమానులకు నా ధన్యవాదాలు’ అని దినేశ్ కార్తిక్‌ భావోద్వేగపూరిత పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ ద్వారా దినేశ్ కార్తిక్‌ తన రిటైర్మెంట్‌ గురించి సంకేతాలిచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 37ఏళ్ల దినేశ్‌ కార్తిక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.   

చాలా కాలంపాటు టీమ్‌ఇండియాకు దూరమైన దినేశ్ కార్తిక్‌ ఈ ఏడాది నిర్వహించిన భారత టీ20 లీగ్‌లో అదరగొట్టి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ముఖ్యంగా పునరాగమనం తర్వాత కొన్ని మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టి బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌లో దినేశ్‌ కార్తిక్‌ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దీంతో దినేశ్ కార్తిక్‌పై వేటుపడింది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌, నవంబర్‌ 25 నుంచి కివీస్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు ఈ వెటరన్‌ ఆటగాడిని ఎంపిక చేయలేదు. 


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts