Dinesh Karthik: నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీవెంటే: దినేశ్‌ కార్తీక్

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అవకాశాలు వాటంతట అవే వస్తాయని నిరూపించాడు బెంగళూరు బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత...

Published : 24 May 2022 01:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అవకాశాలు వాటంతటవే వస్తాయని నిరూపించాడు బెంగళూరు బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతడు ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా సత్తా చాటాడు. దీంతో ఆదివారం మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చేనెల దక్షిణాఫ్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్‌కు సెలెక్షన్‌ కమిటీ అతడిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో దినేశ్‌ కార్తీక్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు క్రికెట్‌ ప్రముఖులు కూడా అతడి ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాక డీకే సైతం ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంటే వస్తాయి’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. తాను ఇలాగే కష్టపడతానని వెల్లడించాడు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 57.40 సగటుతో 287 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 191.33గా ఉంది. దీన్నిబట్టే డీకే ఈ సీజన్‌లో ఎలా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని