INDW vs AUSW: అద్భుతం చేశారు.. అమ్మాయిలపై ఆటగాళ్ల ప్రశంసలు

సూపర్‌ ఓవర్‌లో రాణించిన భారత అమ్మాయిల జట్టుపై టీమ్ఇండియా(Team india) ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు. 

Published : 13 Dec 2022 01:29 IST

ముంబయి: ఉత్కంఠ ఊపేసిన రెండో టీ20లో ఆస్ట్రేలియాను సూపర్‌ ఓవర్లో ఓడించి.. భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. 4 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేశారు. ఈ ఏడాది ఆసీస్‌(Australia) ఖాతాలో తొలి టీ20 ఓటమిని నమోదు చేశారు. ఈ ఘన విజయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జైషా, దినేశ్‌ కార్తిక్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, మిథాలీ రాజ్‌ వంటి వారు ట్విటర్ వేదికగా భారత మహిళల జట్టు(Womens cricket)పై ప్రశంసలు కురిపించారు. 

* టీమ్‌ఇండియాకు అభినందనలు. ఆసీస్‌తో రెండో టీ20లో అసాధారణ విజయం అందుకున్నారు. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన 45,000 మంది అభిమానులకు ధన్యవాదాలు. మహిళల క్రికెట్‌లో ఇది మరో గొప్ప విజయం. -జైషా, బీసీసీఐ కార్యదర్శి

*ఈ ఏడాది టీ20ల్లో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను తొలిసారి ఓడించారు. అసాధారణంగా ఆడారు. స్మృతి మంధాన, షెఫాలి వర్మ, రీచా ఘోష్‌కు నా అభినందనలు. - దినేశ్‌ కార్తిక్‌

* ఇది మహిళల జట్టు సంచలనం.. మీ ప్రతిభకు తల వంచుతున్నా- వసీం జాఫర్‌

* ఆస్ట్రేలియాపై అమ్మాయిలు సాధించిన ఈ గెలుపు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. - ఇర్ఫాన్‌ పఠాన్‌




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు