WPL auction : ఆమె వేలం నిర్వహించిన తీరు అద్భుతం.. మల్లికాసాగర్‌పై డీకే పొగడ్తలు

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL‌) వేలం ప్రక్రియలో మల్లికా సాగర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని.. తన ప్రతిభతో ఎంతో అకట్టుకున్నారని దినేశ్‌ కార్తిక్‌ కొనియాడారు.

Updated : 14 Feb 2023 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : తొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL‌) కోసం సోమవారం నిర్వహించిన వేలం విజయవంతమైంది. ఐదు ఫ్రాంఛైజీలు రూ.59.5 కోట్లను వెచ్చించి 87 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. అయితే.. ఈ వేలం ప్రక్రియలో క్రికెటర్లతోపాటు మరో వ్యక్తి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమే.. వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్‌(Mallika Sagar). ఈ సందర్భంగా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik) ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.  వేలం నిర్వహించిన తీరు అద్భుతమని కొనియాడాడు.

‘మల్లికా సాగర్‌ అద్భుతమైన ఆక్షనీర్‌. చాలా స్పష్టంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. WPLలో సరైన ఎంపిక. వెల్‌డన్‌ బీసీసీఐ’ అని ట్విటర్‌లో డీకే ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ముంబయికి చెందిన మల్లికా‌(Mallika Sagar).. ఆర్ట్‌ కలెక్టర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఆర్ట్‌ ఇండియా కన్సల్టెంట్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రో కబడ్డీ లీగ్‌ వేలం ప్రక్రియకు నిర్వహకురాలిగా కూడా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని