Rohit - DK: రోహిత్ కెప్టెన్సీ నచ్చింది.. కానీ నిర్ణయాలు ఇంకాస్త బెటర్‌గా ఉండాలి: డీకే

మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను అద్భుతంగా నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడని, అయితే ఇంకాస్త ఉత్తమంగా ఉంటే బాగుంటుందని దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు.

Published : 10 Mar 2023 15:49 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీపై సీనియర్ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ విభిన్నంగా స్పందించాడు. ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS) మధ్య జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో దినేశ్‌ కార్తిక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆటలో రోహిత్ శర్మ్ తీసుకున్న పలు నిర్ణయాలపై డీకే విశ్లేషించాడు. అలాగే అక్షర్ పటేల్‌కు బౌలింగ్ ఇవ్వడం, కొత్త బంతిని తీసుకోవడం వంటి అంశాల గురించి చెప్పాడు. 

‘‘తొలి రోజు ఆటలో చాలా భాగం రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంది. ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌లో ఉత్సాహంగా కనిపించాడు. సిల్లీ పాయింట్, షార్ట్‌ లెగ్‌ వంటి సాధారణ పద్ధతులను వాడలేదు. అయినా, నిలకడగా ఫీల్డింగ్ పొజిషన్‌ను కట్టుదిట్టంగా పెట్టాడు. తొలి రోజు మొదటి గంట ఆట మాత్రమే కాస్త వెనుకడుగు వేసినట్లు కనిపించింది.  కానీ, తొలి రోజు నాలుగు వికెట్లు రాబట్టగలిగాడు. మధ్యలో స్మిత్‌, ఉస్మాన్ ఖవాజా క్రీజ్‌లో ఉన్నప్పుడు అంత సులువుగా బౌండరీలు రాలేదు. అయితే, అతడు కొత్త బంతిని తీసుకున్న సమయం సరైంది కాదు. అది గొప్ప నిర్ణయం కాదు’’

‘‘ప్రస్తుతం భారత స్పిన్‌ క్రికెట్‌కు రెండు స్తంభాలుగా ఉన్న రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌తో రోహిత్ ఎక్కువగా ఓవర్లను వేయించాడు. మూడో స్పిన్నర్‌గా తీసుకున్న అక్షర్ పటేల్‌ ఎక్కడ? కొత్త బంతితో కూడా అతడు ఉత్తమంగా బౌలింగ్‌ చేయడం మనం చూశాం. కొత్త బంతిని తీసుకున్నప్పుడైనా సరే..  ఆ బంతితో బౌలింగ్‌ చేసే అవకాశం ఇస్తే బాగుండేది. స్వదేశీ పిచ్‌ల మీద బౌన్స్‌ రాబట్టగలడు’’ అని దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ - ఆసీస్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు జరగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని