PAK v ENG: ఫైనల్‌ మ్యాచ్‌.. మీమర్స్‌కు దొరికిన కొత్త అభిమాని.. నెట్టింట వైరల్‌

ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకొంది. అయితే పాక్‌ బ్యాటింగ్‌ సందర్భంగా ఓ అభిమాని ఎక్స్‌ప్రెషన్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 14 Nov 2022 01:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా అద్భుతంగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ఇంగ్లాండ్ సొంతం చేసుకొంది. పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ కేవలం 137 పరుగులే చేయగలిగింది. ఈ క్రమంలో ఓ పాకిస్థాన్‌ అభిమాని తీవ్ర నిరుత్సాహానికి గురవుతూ స్టేడియంలో కనిపించాడు. దీంతో మీమర్స్‌ సోషల్‌ మీడియాలో చెలరేగిపోయారు. గత వన్డే ప్రపంచకప్‌ సమయంలోనూ ఇలానే ఓ పాక్‌ అభిమాని ఫేమస్‌ అయిపోయిన సంగతి తెలుసు.. ఇప్పుడు వారిద్దరిని కలిపి మీమర్స్‌ హల్‌చల్ చేశారు. 

2019లోనూ వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా.. ఆసీస్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను అసిఫ్‌ అలీ నేలపాలు చేశాడు. అప్పటికే వార్నర్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో తీవ్ర అసహనానికి గురవుతూ ముఖంలో పలికించిన భావోద్వేగం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇలాగే టీ20 ప్రపంచకప్‌లోనూ ఓ పాక్ అభిమాని అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆ అభిమానిని.. ఇప్పుడు ఈ అభిమానిని జత చేసి మీమర్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. తాజాగా ఐసీసీ కూడా ఆ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకొంది.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని