T20 World Cup: కోహ్లీ మాటలతో నిరాశ చెందా: జడేజా

ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ (0), కేఎల్ రాహుల్‌ (3) తొందరగా పెవిలియన్ చేరారు. వీరిద్దరూ తర్వగా పెవిలియన్‌ చేరడంతో జట్టు వెనకబడిందని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ అనడంతో

Updated : 29 Oct 2021 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ (0), కేఎల్ రాహుల్‌ (3) తొందరగా పెవిలియన్ చేరారు. వీరిద్దరూ త్వరగా పెవిలియన్‌ చేరడంతో జట్టు వెనకబడిందని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ అనడం.. తనను నిరాశకు గురి చేసిందని భారత మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నారు. ఓపెనర్లు ఔటైనా విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు తర్వాత బ్యాటింగ్‌కు దిగుతాడు.. కాబట్టి జట్టు అసలు వెనకబడదని పేర్కొన్నాడు. 

‘ఆ రోజు విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలను నేను విన్నాను. ఓపెనర్లు తొందరగా ఔటవ్వడం వల్ల మ్యాచ్‌లో వెనకబడ్డమని అతడు అన్నాడు. ఈ మాటలతో నిరాశ చెందా. ఓపెనర్లు ఔటైనా విరాట్‌ లాంటి ఆటగాడు వారి తర్వాత బ్యాటింగ్‌ చేస్తాడు. కాబట్టి జట్టు వెనకబడే అవకాశమే లేదు. మ్యాచ్‌ చేజారే పరిస్థితి ఉండదు. కోహ్లీ మాటలతో మ్యాచ్ పట్ల భారత్ ఏ విధానాన్ని అవలంభించిందో స్పష్టంగా అర్థమవుతోంది’ అని అజయ్ జడేజా అన్నాడు.

భారత్‌, పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. పాక్‌ బౌలర్‌ షాహీన్‌ ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రోహిత్‌, మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఔటయ్యారు.  తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (57) అర్ధశతకం బాది ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. రిషభ్ పంత్ (39) అతడికి సహకరించాడు. దీంతో భారత్ 151 /7తో నిలిచింది. మహమ్మద్‌ రిజ్వాన్‌ (79), బాబర్‌ అజామ్‌ (68) రాణించడంతో భారత్‌పై పాక్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని