World Cup: డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగానే ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌

World Cup: రాబోయే ఆసియా కప్‌, ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించొచ్చు. మొబైల్‌ యూజర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌ ఈ ఆఫర్‌ను అందిస్తోంది.

Updated : 09 Jun 2023 13:57 IST

దిల్లీ: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాబోయే ఆసియా కప్‌ (Asia Cup), ఐసీసీ పురుషుల ప్రపంచ కప్‌ (World Cup) మ్యాచ్‌లను తమ వేదికపై ఉచితంగా వీక్షించొచ్చని తెలిపింది. అయితే, మొబైల్‌ వీక్షకులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తోంది. క్రికెట్‌ వినోదాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ తెలిపింది.

క్రికెట్‌ వినోదాన్ని వీలైనంత ఎక్కువ మంది మొబైల్‌ వినియోగదారులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ తెలిపింది. భారత్‌లో 540 మిలియన్లకు పైగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు రాబోయే ప్రతిష్ఠాత్మక క్రికెట్‌ టోర్నమెంట్లను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ట్యాబ్లెట్లలో మ్యాచ్‌లను చూసే వారికి కూడా ఈ ఉచిత ఆఫర్‌ వర్తించనుంది.

ఆసియా కప్‌ 2023 సెప్టెంబరులో జరగనుంది. అలాగే పురుషుల ప్రపంచ కప్‌ అక్టోబరు 5న ప్రారంభమై నవంబరు 19వరకు కొనసాగనుంది. ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీలకూ భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఆసియా కప్‌లో భాగంగా మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. 10 దేశాలు తలపడనున్న వరల్డ్‌ కప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే భారత్‌లో ఈ రెండు టోర్నీలకూ విశేష ఆదరణ ఉంటుంది.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌ను రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌ నమోదైన విషయం తెలిసిందే. ఇటు టీవీతోపాటు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ కోట్లాది మంది మ్యాచ్‌లను వీక్షించారు. అయితే, బీసీసీఐ ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ను తొలిసారి విభజించింది. డిస్నీ+ హాట్‌స్టార్‌ టీవీ ప్రసార హక్కులను, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో సినిమా డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకుంది. జియో సినిమా ఉచితంగానే మ్యాచ్‌లను ప్రసారం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని