World Junior Girls Chess: దివ్య విజయం

ప్రపంచ జూనియర్‌ బాలికల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో దివ్య దేశ్‌ముఖ్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో రక్షిత రవిపై ఆమె విజయం సాధించింది. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న టోర్నీలో దివ్య.. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

Published : 12 Jun 2024 04:12 IST

ప్రపంచ జూనియర్‌ బాలికల చెస్‌

గాంధీనగర్‌: ప్రపంచ జూనియర్‌ బాలికల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో దివ్య దేశ్‌ముఖ్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో రక్షిత రవిపై ఆమె విజయం సాధించింది. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న టోర్నీలో దివ్య.. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అర్మేనియాకు చెందిన మరియం (7.5) రెండో స్థానంలో ఉంది. ఆమె 9వ రౌండ్లో రిజ్లోవా (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది. సాచి జైన్‌ 7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. బల్గేరియా అమ్మాయి బెలొస్లావాను ఆమె ఓడించింది. ఓపెన్‌ విభాగంలో కజిబెక్‌ (కజకిస్థాన్‌), రుదిక్‌ (రష్యా), గరబ్యాన్‌ (అర్మేనియా), గాబ్రియెల్‌ (కొలంబియా), క్విజాన్‌ (ఫిలిప్పీన్స్‌) ఏడేసి పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. భారత ఆటగాడు ప్రణవ్‌ ఆనంద్‌ (6 పాయింట్లు) 9వ స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని