
IND vs ENG: పంత్.. అతి దూకుడుగా ఆడొద్దు: మైఖేల్‌వాన్
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్.. ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 17.40 సగటుతో 87 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఒలీ రాబిన్సన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ కోసం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌వాన్ ఒక సలహా ఇచ్చాడు. అతడు దూకుడైన ఆటతీరును వదిలేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
‘నేను కెప్టెన్‌గా ఉండి.. రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఆడితే.. నేను రిషభ్ పంత్‌ని ఏడో స్థానంలో పంపిస్తాను. అతడు( పంత్) అతి దూకుడుగా ఆడుతున్నాడు. టెక్నికల్‌గా ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కట్, స్క్వేర్ డ్రైవ్, ఫుల్, స్వీప్ షాట్లు ఆడటంలో పంత్కి మంచి నైపుణ్యం ఉంది. రిషభ్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజకరమైన క్రికెటర్. అతడి దగ్గర ప్రతిభ ఉంది. కానీ, ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ చేయడం అతనికి కష్టమవుతోంది. ఎందుకంటే.. ఇక్కడ బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అతడు ఆరో స్థానంలో వచ్చినా బంతి స్వింగ్ అవుతూనే ఉంటుంది’ అని మైఖేల్ వాన్ అన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.