Published : 30/11/2021 01:41 IST

IND vs NZ: విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాం : అజింక్య రహానె

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై భారత కెప్టెన్‌ అజింక్య రహానె స్సందించాడు. ‘విజయం కోసం మేమంతా శాయశక్తులా ప్రయత్నించాం. ఐదో రోజు తొలి సెషన్‌ తర్వాత మా బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ఒక్క చివరి సెషన్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టారు. మరోవైపు, న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా ఆఖరి వరకు గొప్పగా పోరాడారు. మేం మరో ఐదారు ఓవర్లు ఆటను కొనసాగించాలనుకున్నాం. అయితే, వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను ముందుగానే ముగించాల్సి వచ్చింది. ఈ విషయంలో అంపైర్లు సరైన నిర్ణయమే తీసుకున్నారనుకుంటున్నాను. ఈ టెస్టులో మెరుగ్గా రాణించిన అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కి శుభాకాంక్షలు. టెస్టు క్రికెట్‌ అరంగేట్రం కోసం అతడు చాలా కాలంగా ఎదురు చూశాడు. వచ్చిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌కి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అందుబాటులోకి వస్తున్నాడు. ముంబయిలో జరుగనున్న రెండో టెస్టు గురించి నేనేమీ చెప్పలేను. జట్టు యాజమాన్యమే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటుంది’ అని మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె పేర్కొన్నాడు.

మరోవైపు, తమ ఆటగాళ్లు అసాధారణ పోరాట పటిమతో మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించారని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ‘ఇదో గొప్ప మ్యాచ్‌. విజయం ఆఖరి వరకు భారత్‌ని ఊరించింది. రోజంతా బ్యాటింగ్ కొనసాగించేందుకు మేం తీవ్రంగా శ్రమించాం. సోమర్‌ విల్లేతో పాటు ఆఖర్లో వచ్చిన రచిన్ రవీంద్ర, అజాజ్‌ పటేల్ గొప్పగా పోరాడారు. టిమ్‌ సౌథీ, కైల్ జేమీసన్‌ మెరుగ్గా రాణించారు. సుదీర్ఘ ఓవర్లు బౌలింగ్ చేయడం అసాధారణ విషయం. టీమ్‌ఇండియా కూడా విజయం కోసం గొప్పగా పోరాడింది. ముంబయిలో జరుగనున్న రెండో టెస్టు కోసం భిన్నమైన పిచ్‌ని తయారు చేస్తారనుకుంటున్నాను’ అని న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని