భారీ అంచనాలతో.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దు: మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌

ఇటీవల ముగిసిన ఓవల్‌ టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆల్‌ రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌పై భారీ అంచనాలు పెట్టుకుని.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సూచించాడు.

Published : 09 Sep 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్కు : ఇటీవల ముగిసిన ఓవల్‌ టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆల్‌ రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌పై భారీ అంచనాలు పెట్టుకుని.. అతడిని ఒత్తిడికి గురి చేయొద్దని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సూచించాడు. ‘అంతర్జాతీయ కెరీర్‌ను శార్థూల్‌ ఠాకూర్‌ చాలా గొప్పగా ప్రారంభించాడు. ఓవల్‌ టెస్టులో రెండు అర్ధ శతకాలు, రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే, అప్పుడే అతడిపై ఓ అంచనాకు వచ్చి మేటి ఆల్ రౌండర్‌గా ముద్ర వేసి ఒత్తిడి పెంచొద్దు. జట్టులో కుదురుకుని నిలకడైన ప్రదర్శన చేసేందుకు అతడికి కొంత సమయం ఇవ్వాలి. ఈ తరం క్రికెట్‌కి ఎనిమిదో స్థానంలో బ్యాట్‌తో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చే మేటి ఆల్‌ రౌండర్ల అవసరం చాలా ఉంది. ఆ స్థానంలో ఆడేందుకు శార్థూల్ సరిగ్గా సరిపోతాడు. ప్రస్తుతానికి మరి కొన్ని మ్యాచుల్లో అతడిని ఎనిమిదో స్థానంలోనే ఆడిస్తూ.. బాగా రాణించేందుకు సహకరించాలి’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు