Cricket news: రాహుల్‌ ద్రవిడ్‌కు విశ్రాంతి.. లక్ష్మణ్‌కు బాధ్యతలు

భారత్‌ క్రికెట్‌  కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు ఆయన దూరంగా ఉండనున్నారు. ఆయన స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

Published : 12 Nov 2022 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 వరల్డ్‌కప్‌ సిరీస్‌ నుంచి భారత్‌ నిష్క్రమించిన నేపథ్యంలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. వెల్లింగ్టన్‌ వేదికగా నవంబరు 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు ఆయన దూరంగా ఉండనున్నారు. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్న లక్ష్మణ్‌.. గతంలోనూ భారత్‌ క్రికెట్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐర్లాండ్‌, జింబాబ్వే సిరీస్‌లకు, గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లకు కోచ్‌గా పని చేసిన అనుభవముంది. ఫిబ్రవరిలో అండర్‌-19 వరల్డ్‌ కప్‌ సాధించిన జట్టుకు లక్ష్మణ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.

న్యూజిలాండడ్‌ సిరీస్‌ ముగిసిన తర్వాత లక్ష్మణ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలగుతారు. నవంబరు 30 న్యూజిలాండ్‌తో మూడో వన్డే పూర్తి చేసుకున్న భారత్‌ వెంటనే బంగ్లాదేశ్‌కు పయనమవుతుంది. డిసెంబరు 4 నుంచి ఆ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. మరోవైపు ద్రవిడ్‌తోపాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ కూడా న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. టీ20 మ్యాచ్‌లకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించగా.. వన్డే మ్యాచ్‌ల కెప్టెన్‌ బాధ్యతలను శిఖర్‌ ధావన్‌ చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు