Virat Kohli : నా కల నెరవేరింది : దీపక్‌ హుడా

టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా వన్డే క్యాప్‌ అందుకోవాలన్న కల నెరవేరిందని యువ ఆటగాడు దీపక్‌ హుడా అన్నాడు. చారిత్రక 1,000వ వన్డే...

Published : 08 Feb 2022 01:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా వన్డే క్యాప్‌ అందుకోవాలన్న కల నెరవేరిందని యువ ఆటగాడు దీపక్‌ హుడా అన్నాడు. చారిత్రక 1,000వ వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు దీపక్‌ హుడా.. కోహ్లీ నుంచి క్యాప్‌ అందుకుని భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దీపక్‌(26: 32 బంతుల్లో 2×4)పరుగులతో రాణించాడు.

‘దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం దొరకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం చాలా ప్రత్యేకం. నా కల నెరవేరింది. ఈ అద్భుత ప్రయాణంలో నా ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని దీపక్‌ హుడా ట్వీట్‌ చేశాడు.

* విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడటం నాకు కలిసొచ్చింది : వాషింగ్టన్‌ సుందర్‌

ఇదిలా ఉండగా, వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్ల తీసిన ఆల్ రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌.. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడిన అనుభవం చాలా ఉపయోగపడిందని అతడు పేర్కొన్నాడు. భిన్న పరిస్థితుల్లో కూడా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టేందుకు అది చాలా ఉపయోగపడిందని చెప్పాడు. ‘పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం. గత కొన్నేళ్లుగా నేను పవర్‌ ప్లేలోనే ఎక్కువగా బౌలింగ్ చేస్తున్నాను. దానికి తోడు విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడిన అనుభవం కూడా ఉపయోగపడింది. ముఖ్యంగా అక్కడ కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం కలిసొచ్చింది’అని సుందర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్‌ సుందర్‌ (3/30) ప్రదర్శనతో.. భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని