Dwayne Bravo: డ్వేన్‌బ్రావో ముందు అతిగొప్ప రికార్డు.. మలింగనే అధిగమించే ఛాన్స్‌

చెన్నై సూపర్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో మెగా టీ20 లీగ్‌లో ఓ అతిగొప్ప రికార్డుపై కన్నేశాడు. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక పేస్‌ దిగ్గజం‌, ముంబయి...

Published : 31 Mar 2022 13:32 IST

(Photos: Bravo, Malinga Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో మెగా టీ20 లీగ్‌లో ఓ అతిగొప్ప రికార్డుపై కన్నేశాడు. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక పేస్‌ దిగ్గజం‌, ముంబయి మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ (170) సరసన కొనసాగుతున్న చెన్నై ఆల్‌రౌండర్‌.. ఈ రోజు లఖ్‌నవూతో జరగబోయే మ్యాచ్‌లో మరో వికెట్‌ సాధిస్తే తన పేరిట కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో బ్రావో కోల్‌కతాపై 3 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మలింగ సరసన 170 వికెట్లతో సమానంగా నిలిచాడు. మలింగ మొత్తం 122 మ్యాచ్‌ల్లో 19.79 సగటుతో ఈ ఘనత సాధిస్తే.. బ్రావో 152 మ్యాచ్‌ల్లో 24 సగటుతో అన్నే వికెట్లు తీశాడు. ఇక ఈ రోజు చెన్నై ఆల్‌రౌండర్‌ ఎన్ని ఎక్కవ వికెట్లు సాధిస్తే.. అంతముందుకు దూసుకెళ్తాడు. ఈ జాబితాలో అమిత్‌ మిశ్రా (166), పీయుష్‌ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150) వికెట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని