Harmanpreet Kaur: ఝులన్‌కు గెలుపుతో వీడ్కోలు పలుకుతాం: హర్మన్‌ప్రీత్‌కౌర్‌

రెండు దశాబ్దాల పాటు సాగిన క్రికెట్‌ ప్రస్థానానికి భారత మహిళా జట్టు సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే.

Published : 23 Sep 2022 00:32 IST

దిల్లీ: రెండు దశాబ్దాల పాటు సాగిన తన క్రికెట్‌ ప్రస్థానానికి భారత మహిళా జట్టు సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఆడనున్న మూడో వన్డే మ్యాచ్‌ ఆమెకు చివరిది కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ గెలిచి ఆమెకు గొప్ప వీడ్కోలు పలుకుతామని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడమే తనకు గొప్ప బహుమతి అని హర్మన్‌ప్రీత్‌ తెలిపింది. 1999 తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌ గడ్డపై తొలిసారిగా వన్డే సిరీస్‌ను నెగ్గింది.     

‘‘లార్డ్స్‌లో జరగనున్న మ్యాచ్‌ మాకు ఎంతో కీలకం ఎందుకంటే  ఝులన్‌ ఆటకు వీడ్కోలు పలకనుంది. ఈ  మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా మీము ఆడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌ మా అందరికీ ఎంతో భావోద్వేగతంతో కూడుకున్నది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలని అనుకుంటున్నాం. నేను టీమ్‌లోకి వచ్చిన కొత్తలో ఆమే నాకు నాయకురాలు. తన నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం జట్టులో ఉన్న జూనియర్‌ బౌలర్లు రేణుక, మేఘన సింగ్‌ కూడా తనను చూసే ఆటలో మెళుకువలు నేర్చుకున్నారు. మా అందరికీ తనే స్ఫూర్తి’’ అని తెలిపింది. 

2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఝులన్‌.. నాలుగేళ్ల క్రితం టీ20లకు స్వస్తి పలికింది. ఆమె కెరీర్‌లో మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించింది. వన్డే ఫార్మట్లలో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts