CWG 2022: పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో భారత్‌కు స్వర్ణం-రజతం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఇద్దరు అథ్లెట్లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం........

Updated : 17 Aug 2022 12:31 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఇద్దరు అథ్లెట్లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఎల్దోస్‌ పాల్‌ 17.03మీటర్లు దూకి పసిడి సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. మన దేశానికే చెందిన అబ్దుల్లా అబూబకర్‌ నరంగోలింటెవిడ్‌ 17.02 మీటర్లు దూకి రజతం సాధించాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రవేల్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

10వేల మీటర్ల పరుగులో కాంస్యం

10,000మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్‌ సందీప్‌ కుమార్‌ సత్తా చాటాడు. 38:49.21నిమిషాల్లో పరుగు పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. సందీప్‌కు ఇదే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. ఈ పతకంతో భారత్‌ ఖాతాలో 46 పతకాలు చేరాయి.

జావెలిన్‌ త్రోలో అన్ను రాణికి కాంస్యం

మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో భారత్‌కు చెందిన అన్ను రాణి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. జావెలిన్‌ను 60మీటర్ల దూరం విసిరి ఈ పతకాన్ని దక్కించుకుంది.

కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్‌ తాజా గణాంకాల ప్రకారం.. 16 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో  5వ స్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు  మొత్తంగా 47 పతకాలున్నాయి. అయితే 44 పతకాలతోనే ఉన్న న్యూజిలాండ్‌ 4వ స్థానంలో కొనసాగుతోంది. ఎందుకంటే ఆ దేశ ఖాతాలో 17 స్వర్ణాలు ఉండటమే కారణం. అయితే ఈరోజు, రేపు మరిన్ని విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడనుంటడంతో న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 164 (61 స్వర్ణాలు) పతకాలతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఆతిథ్య దేశం ఇంగ్లాండ్‌ 155 (50 స్వర్ణాలు), కెనడా 85 (23 స్వర్ణాలు) పతకాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని