Commonwealth Games : ఒక్క అథ్లెట్‌.. 11 కామన్వెల్త్‌ స్వర్ణాలు

ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియాన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా అవతరించింది. ఆమె ఈ క్రీడల్లో 11వ స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో క్రీడల్లో ఆమె కామన్వెల్త్‌ పసిడి వేట మొదలైంది. గత రెండు పర్యాయాల్లో కలిపి 8 స్వర్ణాలు సాధించిన ఆమె..

Updated : 02 Aug 2022 08:41 IST

బర్మింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియాన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా అవతరించింది. ఆమె ఈ క్రీడల్లో 11వ స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో క్రీడల్లో ఆమె కామన్వెల్త్‌ పసిడి వేట మొదలైంది. గత రెండు పర్యాయాల్లో కలిపి 8 స్వర్ణాలు సాధించిన ఆమె.. ప్రస్తుత క్రీడల్లో మూడో బంగారు పతకం చేజిక్కించుకుంది. 4×100 మీ. ఫ్రీస్టైల్‌, రిలే, 4×100 మీ. మిక్స్‌డ్‌ రిలే విభాగాల్లో ఆమె స్వర్ణాలు సాధించింది. తమ దేశానికే చెందిన స్విమ్మర్లు సుసీ ఓనీల్‌, ఇయాన్‌ థోర్ప్‌, లీజెల్‌ జోన్స్‌ల పేరిట 10 స్వర్ణాలతో ఉన్న రికార్డును మెక్‌కియాన్‌ బద్దలు కొట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని