రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!

తనపై వచ్చిన విమర్శలు, దెప్పిపొడుపులకు నేడు తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌. టెస్టు మ్యాచ్‌లో టీ20 తరహా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆస్ట్రేలియా గడ్డపై

Published : 20 Jan 2021 01:51 IST

మ్యాచ్‌ అనంతరం పంత్ భావోద్వేగం

బ్రిస్బేన్‌: తనపై వచ్చిన విమర్శలు, దెప్పిపొడుపులకు నేడు తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌. టెస్టు మ్యాచ్‌లో టీ20 తరహా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం పంత్‌ మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. తన జీవితంలో గొప్ప క్షణం ఇదేనని ఆనందం వ్యక్తం చేశాడు.

‘‘ఇది నా డ్రీమ్‌ సిరీస్‌. ఈ క్రెడిట్‌ అంతా జట్టు మేనేజ్‌మెంట్‌దే. నేను మ్యాచ్‌ విన్నర్‌ అవుతానని, జట్టును గెలిపిస్తానని పదేపదే నన్ను ప్రోత్సహించేవారు. నాపై నమ్మకం ఉంచారు.  నేను విఫలమైనప్పుడు కూడా మేనేజ్‌మెంట్‌, నా సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. జట్టును గెలిపించాలని ప్రతిరోజూ అనుకునేవాణ్ని. ఇవాళ అది సాధించాను’’ అని పంత్‌ తెలిపాడు. 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో రిషభ్‌ పంత్‌(89నాటౌట్‌; 138 బంతుల్లో 9×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అటు వికెట్‌ కాపాడుకోడానికి ప్రాధాన్యమిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 97వ ఓవర్‌ చివరి బంతికి బౌండరీ కొట్టి భారత్‌కు ఎప్పటికీ గుర్తిండిపోయే విజయాన్ని అందించాడు. దీంతో పంత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఇవీ చదవండి..

భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు

ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది

భారత్‌ చిరస్మరణీయ విజయం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని