
IND vs ENG: చివరి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టులో మార్పులు
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియాతో మాంచెస్టర్ వేదికగా జరిగే చివరి(ఐదో)టెస్టు కోసం ఇంగ్లాండ్.. 16 మందితో జట్టుని ప్రకటించింది.తన భార్య రెండవ కాన్పునకు అందుబాటులో ఉండేందుకు నాలుగో టెస్టుకు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కొన్ని నెలలుగా టెస్టు క్రికెట్ ఆడని లెప్టార్మ్ స్పిన్నర్ జాక్‌లీచ్‌కి పిలుపు వచ్చింది.మొయిన్ అలీకి సహకారంగా ఉంటాడనే ఉద్దేశంతో లీచ్ ఎంపిక చేశారు. దీంతో లీచ్‌కి తుది జట్టులో స్థానం ఖాయమైనట్టే. సామ్ బిల్లింగ్స్‌ని జట్టు నుంచి తప్పించారు.
సెప్టెంబరు 10న మాంచెస్టర్ వేదికగా ఐదో టెస్టు ప్రారంభంకానుంది. కాగా.. సిరీస్‌లో టీమ్ఇండియా 2-1తో అధిక్యంలో ఉంది. మొదటి టెస్టు డ్రాగా ముగియగా..రెండు, నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. మూడో టెస్టులో అతిథ్య జట్టు గెలుపొందింది.
ఇంగ్లాండ్ జట్టు:
జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్ స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, క్రాగ్ ఓవర్టన్, ఒలీ పోప్, ఒలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.