
T20 World Cup:ఇంగ్లాండ్‌కు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం..
(Photo: Sam Curran Twitter)
ఇంటర్నెట్ డెస్క్:టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ టీ 20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. రీస్ టోప్లేను రిజర్వ్ ఆటగాడిగా ఎంపికచేసినట్లు పేర్కొంది. మరో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనుహ్యంగా అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం, ఇప్పుడు సామ్ కరన్ దూరం కావడం టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ వెల్లడించింది. మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు పేర్కొంది.వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్న సామ్ కరన్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సీఎస్కే యాజమాన్యం తెలిపింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన సామ్‌కరన్.. 56 పరుగులు చేశాడు. తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.