INDw Vs ENG w: భారత్‌కు తొలి ఓటమి.. ఇంగ్లాండ్‌ హ్యాట్రిక్‌ విక్టరీ

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) భారత్‌ పరాజయం పాలైంది. గ్రూప్‌ స్టేజ్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో చివరి వరకూ పోరాడినా టీమ్‌ఇండియాకు (Team India) ఓటమి తప్పలేదు. దీంతో సెమీస్‌ కోసం మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది.

Updated : 18 Feb 2023 22:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్‌ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్‌ (5/15) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 140/5 స్కోరుకే పరిమితమైంది. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లాండ్‌కు దాదాపు సెమీస్‌ బెర్తు ఖరారైనట్లే. భారత్‌ తన చివరి  మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఫిబ్రవరి 20వ తేదీన తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్‌కు గ్రూప్‌ -B నుంచి రెండో సెమీస్‌ బెర్తు సొంతమవుతుంది. 

ఆరంభంలో మంధాన.. చివర్లో రిచా ఘోష్

ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 152 లక్ష్య ఛేదనను ఓపెనర్‌ స్మృతీ మంధాన (52) దూకుడుగానే ప్రారంభించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా సరే వేగం మాత్రం ఆపలేదు. కానీ, ఆమెకు తోడుగా నిలిచేవారే కరవయ్యారు. అయితే, రిచా ఘోష్ (47*) చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. మిడిల్‌ ఓవర్లలో పరుగుల వేగం మందగించడంతో ఛేదన రన్‌రేట్‌ భారీగా పెరిగిపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు సారా గ్లెన్ 2.. లారెన్ బెల్‌, సోఫీ చెరో వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని